: రాణి ముఖర్జీ కూతురు పేరు ఆదిరా... పండంటి పాపకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ టాప్ హీరోయిన్ రాణి ముఖర్జీ తల్లి అయ్యింది. సుదీర్ఘ కెరీర్ లో పలు హిట్ చిత్రాల్లో నటించిన రాణి ముఖర్జీ గతేడాది ఏప్రిల్ లో దర్శక, నిర్మాణ ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకుంది. ఆ తర్వాత అటు సినిమాలకే కాక ఇటు మీడియాకు కూడా ఆమె దూరంగా ఉంటోంది. తాజాగా నేటి ఉదయం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ప్రకటించారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో రాణి ముఖర్జీ, ఆదిత్యా దంపతులకు ఆడబిడ్డ పుట్టిందని అతడు ట్విట్టర్ లో ప్రకటించాడు. అంతేకాక పుట్టిన పాపకు తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ‘ఆదిరా’ అనే పేరును కూడా వారు పెట్టేశారు.