: కృష్ణా, గోదావరి జలాల పంపకాలలో తెలంగాణకు అన్యాయం: కడియం


కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాలలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో కేంద్రం తీరు దుర్మార్గమని, రాష్ట్రానికి కేంద్రం తీరని ద్రోహం చేస్తోందని ఆరోపించారు. నదీ జలాల వ్యవహారంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తమ వైఖరేంటో టి.టీడీపీ, టి.బీజేపీ నేతలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై రాజకీయ, న్యాయపోరాటం చేస్తామని కడియం చెప్పారు. కృష్ణానదీ జలాల పునఃపంపిణీ రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలని తాజాగా కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పడంపై పలువురు టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

  • Loading...

More Telugu News