: ఉగ్రవాదులపై ప్రతీకారమంటూ, లాస్ ఏంజిల్స్ లో గురుద్వారాను ధ్వంసం చేసిన అమెరికన్లు!


కాలిఫోర్నియాపై ఉగ్రదాడి తరువాత ఐఎస్ఐఎస్ పై అత్యంత ఆగ్రహావేశాలతో ఉన్న అమెరికన్లు ఒక్కోసారి విచక్షణ కోల్పోతున్నారు. లాస్ ఏంజిల్స్ సమీపంలోని ఓ గురుద్వారాను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వెళుతూ వెళుతూ దేవాలయం గోడలపై అసభ్యకరమైన, ద్వేషపూరిత వ్యాఖ్యలు రాసి మరీ వెళ్లారు. ఈ ఘటన అమెరికాలోని సిక్కుల భద్రత, రక్షణలపై మరోమారు ఆలోచనను పెంచిందని బ్యూనా పార్క్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడు ఇంద్రజ్యోత్ సింగ్ వివరించారు. ఉగ్రవాదుల చర్యలు తమపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన వాపోయారు. ప్రతి వారమూ దాదాపు 800 మంది వరకూ సిక్కులు హాజరై ఈ ఆలయంలో ప్రార్థనలు జరుపుతారని తెలుస్తోంది. ఘటన గురించి వాకబు చేసిన అధ్యక్ష కార్యాలయం, తదుపరి విచారణను హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి అప్పగించింది. మరోవైపు లాస్ ఏంజిల్స్ పోలీసులు దర్యాఫ్తు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News