: హార్ట్ ఆఫ్ ఏసియా సదస్సు ప్రారంభం... సుష్మాకు నవాజ్ ఆత్మీయ పలకరింపు
ఆఫ్ఘనిస్థాన్ కు ప్రాంతీయ సహకారంపై ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ పేరిట జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు కొద్దిసేపటి క్రితం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాదులో ప్రారంభమైంది. ఈ సదస్సు కోసం భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లారు. చాలాకాలం తర్వాత భారత ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఇస్లామాబాదు వెళ్లడంతో ఈ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక సమావేశానికి వెళ్లిన సుష్మాను సదస్సు వేదిక వద్ద పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆత్మీయంగా పలకరించారు. సదస్సు ముగిసిన తర్వాత నవాజ్ తో పాటు పాక్ విదేశాంగ శాఖ మంత్రి సర్తాజ్ అజీజ్ తోనూ సుష్మా భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న పలు సమస్యలు ప్రస్తావనకు రానున్నాయి.