: కొద్దిగా మెరుగుపడిన సీపీఐ నేత బర్దన్ ఆరోగ్యం
అస్వస్థత కారణంగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరిన సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడింది. రెండు రోజుల కిందట ఆయన వైద్య చికిత్సకు స్పందించలేదని, కానీ ఇప్పుడు కళ్లు తెరచి చూస్తున్నారని ఆ పార్టీ నేత అతుల్ అంజన్ తెలిపారు. ఎడమకాలు కూడా కదపగలుగుతున్నారని చెప్పారు. సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తదితరులు బర్దన్ ను ఆసుపత్రిలో పరామర్శించారు.