: వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ పై కేసు


ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ పై కేసు నమోదైంది. కొణిజర్ల-2 ఎంపీటీసీ నాగలక్ష్మి భర్త సత్యనారాయణ ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. టీఆర్ఎస్ లో చేరాలంటూ ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎంపీటీసీ భర్త ఫిర్యాదు చేశారు. ఖమ్మం మూడో అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి సీహెచ్ పంచాక్షరి ఆదేశాల మేరకు వైరా సీఐ చేరాలు ఆధ్వర్యంలో కొణిజర్ల పోలీసులు గత రాత్రి కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News