: కడపలో ఆర్టీసీ బస్సు బీభత్సం... విద్యార్థులపైకి దూసుకెళ్లిన వైనం
కడప జిల్లా ఖాజీపేట మండలం చెన్నముక్కపల్లెలో కొద్దిసేపటి క్రితం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. పాఠశాలకు వెళ్లే క్రమంలో రోడ్డు పక్కగా నిలబడి ఉన్న విద్యార్థులపైకి ఆ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెనువెంటనే స్పందించిన స్థానికులు విద్యార్థులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొంతమంది యువకులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. బస్సుపై దాడి చేసి దానిని ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.