: ఐఎస్ఐఎస్ స్థావరాలపై తొలిసారిగా మిసైల్స్ వర్షం కురిపించిన జలాంతర్గాములు


ఐఎస్ఐఎస్ పై రష్యా జరుపుతున్న యుద్ధం మరో ముందడుగేసింది. మధ్యదరా సముద్రంలో మోహరించిన జలాంతర్గామి నుంచి తొలిసారిగా మిసైల్స్ తో సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ లక్ష్యాలపై దాడులు చేసినట్టు రష్యా రక్షణ మంత్రి సెర్గి షోగు వెల్లడించారు. రఖ్కాలోని రెండు పెద్ద ఉగ్రవాద స్థావరాలపై సబ్ మెరైన్ 'రస్తోవ్ ఆన్ డాన్' నుంచి క్షిపణులను ప్రయోగించినట్టు ఆయన తెలిపారు. "మేము పూర్తి నమ్మకంతో చెబుతున్నాం. మా దాడిలో ఆయుధాలు దాచిన భవంతిని, చమురు వెలికితీత కోసం మౌలిక వసతులను అందించే ఫ్యాక్టరీని ధ్వంసం చేశాం. వారికి ఎంతో నష్టం కలిగించాం" అని తెలిపారు. జలాంతర్గాములను ప్రయోగిస్తున్న విషయాన్ని ఇజ్రాయిల్, అమెరికాలకు ముందే చెప్పామని ఆయన అన్నారు. గడచిన మూడు రోజుల్లో రష్యా దళాలు సిరియాలోని 600 వరకూ లక్ష్యాలను ధ్వంసం చేశాయని తెలిపారు. అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు రష్యన్ యుద్ధ విమానాలు ఐఎస్ఐఎస్ స్థావరాలపై బాంబులేస్తున్నాయని వెల్లడించారు.

  • Loading...

More Telugu News