: 'జెండాపై కపిరాజు' హీరోయిన్ రాగిణిపై పోలీసు కేసు


కన్నడ హీరోయిన్, తెలుగులో నాని సరసన 'జెండాపై కపిరాజు' చిత్రంలో నటించిన రాగిణి ద్వివేదీపై బెంగళూరు పరిధిలోని జేపీ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 'నాటికోలి' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న వెంకటేష్ అనే నిర్మాత ఈ ఫిర్యాదు చేశారు. తన చిత్రంలో యాక్ట్ చేసేందుకు రాగిణితో ఒప్పందం కుదుర్చుకుని, ఆమె సోదరుడు రుద్రాక్షి దీక్షిత్ కు రూ. 17 లక్షల వరకూ చెల్లించానని, కొన్ని కారణాల వల్ల సినిమా నిర్మాణం ఆగిపోగా, ఇంతవరకూ ఆ డబ్బు తిరిగి చెల్లించలేదని ఆ నిర్మాత ఫిర్యాదు చేశాడు. ఎన్నోమార్లు డబ్బు కోసం ఆడుగగా, మరో సినిమాలో నటిస్తానే తప్ప డబ్బిచ్చేది లేదని ఆమె చెప్పడంతో పోలీసులను ఆశ్రయించాడు. వెంకటేష్ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News