: సతీసమేతంగా విజయవాడకు కేసీఆర్!...చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకేనట!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు రావాలని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆహ్వానించేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్వయంగా హైదరాబాదులోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు. తాజాగా కేసీఆర్ కూడా తాను నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు ఏకంగా విజయవాడ వెళ్లనున్నారు. అది కూడా సతీసమేతంగా ఆయన విజయవాడలోని చంద్రబాబు నివాసానికి వెళతారట. ఈ మేరకు విజయవాడ వెళ్లాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్, ఎప్పుడు వెళ్లాలి? అన్న విషయాన్ని మాత్రం ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత ఖరారు చేస్తారట. ప్రత్యేక హెలికాప్టర్ లో భార్యతో కలిసి విజయవాడకు వెళ్లనున్న కేసీఆర్, చంద్రబాబుకు చండీయాగం ఆహ్వానాన్ని అందించనున్నారు. రేపు సాయంత్రానికి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాదు చేరుకునే కేసీఆర్, విజయవాడ పర్యటన తేదీని ఖరారు చేస్తారు. ఈ నెల 23న ప్రారంభం కానున్న చండీయాగానికి ఆయన ఇప్పటికే పలువురు ప్రముఖులను ఆహ్వానించగా, మరికొందరికి కూడా ఆయన ఆహ్వానం పలకనునున్నారు.

  • Loading...

More Telugu News