: షీనా బోరా హత్య కేసు దర్యాప్తును డిసెంబర్ 17 లోగా పూర్తి చేయండి: సీబీఐ ప్రత్యేక కోర్టు


షీనా బోరా హత్య కేసును తొందరగా తేల్చాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను ఆదేశించింది. 2012లో హత్యకు గురైన షీనా బోరా కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో షీనా బోరా సొంత తల్లి ఇంద్రాణీ ముఖర్జియా హత్య చేసినట్టు వెల్లడైంది. దీంతో ఆమె ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియా, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ లను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో దర్యాప్తును ఈ నెల 17లోగా పూర్తి చేయాలని సీబీఐ అధికారులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.

  • Loading...

More Telugu News