: వరద బాధితులకు హృతిక్ రోషన్ విరాళం
చెన్నైలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ముందుకు వచ్చారు. అయితే షారూఖ్ ఖాన్ లా హృతిక్ నేరుగా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించలేదు. వరద బాధితులను ఆదుకునేందుకు స్టార్ హోదా పక్కనపెట్టిన టాలీవుడ్ నటులను హృతిక్ సంప్రదించాడు. నేరుగా నవదీప్ కు ఫోన్ చేసిన హృతిక్ చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడని నవదీప్ తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించాడు. హృతిక్ స్వయంగా ఫోన్ చేసి విరాళం ఇచ్చాడని నవదీప్ తెలిపాడు. నవదీప్ ప్రకటనను అంతా అభినందిస్తున్నారు. అయితే ఆ విరాళం ఎంత? అన్నది వెల్లడించకపోవడం విశేషం.