: అమరావతి మొదటి దశ నిర్మాణంపై కమిటీ ఏర్పాటు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి మొదటి దశ నిర్మాణంపై ఏపీ సర్కార్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో 10 మంది కార్యదర్శులు ఉన్నారు. 2018 నాటికి పూర్తి చేయాల్సిన విధివిధానాల రూపకల్పనపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.