: పోలీసుల ఛేజ్..బోల్తా కొట్టిన నేరస్తుల వ్యాన్!


నేరస్తులు వ్యాన్ లో పారిపోతున్నారన్న సమాచారంతో అక్కడే కాపు గాచి ఉన్న పోలీసులు వారిని ఛేజ్ చేశారు. ఒకటి, రెండు కిలోమీటర్లు కాదు, ఏకంగా 20 కిలోమీటర్లు వారిని వెంబడించిన ఈ సంఘటన గుర్గావ్ శివార్లలోని బాద్షాపూర్ వద్ద జరిగింది. ఈ సంఘటనపై డిప్యూటీ పోలీసు కమిషనర్ బల్బీర్ సింగ్ మాట్లాడుతూ, నేరస్తులు పారిపోతున్నారనే ముందస్తు సమాచారంతో క్రైం బ్రాంచ్ పోలీసుల బృందం రంగంలోకి దిగింది. మంగళవారం తెల్లవారుజామున బాద్షాపూర్ వద్ద కాపు గాచింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రెండు పికప్ వ్యాన్లను పోలీసులు ఆపారు. ఈ వ్యాన్లలో 10 మంది నేరస్తులు ప్రయాణిస్తున్నారు. ఈ వాహనాలను పోలీసులు ఆపడంతో వారు కాల్పులకు పాల్పడటంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో నేరస్తులు తమ వాహనాలను సోహ్నా వైపునకు మళ్లించి పారిపోయారు. ఈ వాహనాలను పోలీసులు వెంబడించి, నలుగురు నేరస్తులను అరెస్టు చేశారు. కాగా, తప్పించుకునే క్రమంలో ఒక వ్యాన్ బోల్తా కొట్టడంతో ఇద్దరు నేరస్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఛేజింగ్ లో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. నేరస్తుల నుంచి నాలుగు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్లు బల్బీర్ సింగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News