: టాప్ టెన్ లో తొలిసారి జడేజా...కోహ్లీని దాటిన రహానే
ఐసీసీ ర్యాంకింగ్స్ లో నలుగురు టీమిండియా ఆటగాళ్లు సత్తాచాటారు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీల ర్యాంకులు మెరుగుపడ్డాయి. అంచనాలకు మించి రాణించడంతో రవీంద్ర జడేజా ఐసీసీ ర్యాంకింగ్స్ జాబితాలో తొలిసారి టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్నాడు. టెస్టు బౌలర్ల జాబితాలో 11వ ర్యాంకులో ఉన్న జడేజా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని టాప్ 7 ర్యాంకుకు చేరుకున్నాడు. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా జరిగిన టెస్టు సిరీస్ కు ముందు టెస్టుల్లో 26వ ర్యాంకులో ఉన్న అజింక్యా రహానే 14 స్థానాలు మెరుగుపరుచుకుని 12వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇప్పటివరకు రహానే సాధించిన బెస్ట్ ర్యాంక్ ఇదే కావడం విశేషం. అలాగే టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 14వ ర్యాంకుకు చేరుకున్నాడు. కోహ్లీ ర్యాంకింగ్ ను రహానే అధిగమించడం విశేషం.