: నోరూరిస్తున్న పుతిన్ విగ్రహం... చాక్లెట్ ఫెస్టివల్ లో ఆకట్టుకుంటున్న రష్యా అధినేత
చాక్లెట్ తో తయారుచేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విగ్రహం నోరూరిస్తోంది. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో చాక్లెట్ ఫెస్టివల్ మొదలైంది. అక్కడికి వచ్చినవారందరికీ స్వాగతం పలుకుతున్న పుతిన్ ను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. కారణం పూర్తిగా చాక్లెట్ తో చేసిన పుతిన్ విగ్రహాన్ని అక్కడ నిలబెట్టడమే! పక్కన పెంపుడు కుక్కతో ఆయన నిలబడి ఉన్నట్టుగా ఆ విగ్రహాన్ని రూపొందించారు. రష్యాలోని ప్రముఖ శిల్పి 70 కేజీల చాక్లెట్ తో ఈ విగ్రహాన్ని రూపొందించారట. దాంతో ఫెస్టివల్ కు వచ్చిన వారందరూ పుతిన్ పక్కన సరదాగా ఫోటోలు దిగుతుంటే, మరికొందరు చాక్లెట్ ను తినేయాలని ఆబగా చూస్తున్నారు.