: చెన్నైలో వర్షాలపై వాట్స్ యాప్ లో పుకార్లు!
సోషల్ మీడియాలో ఓ పుకారు హల్ చల్ చేస్తోంది. ఈ పుకారు వ్యూహకర్తలు ఎవరో తెలియదు కానీ, వాట్స్ యాప్ ద్వారా దీనిని షేర్ చేసుకున్నారు. అంతే వైరల్ గా మారింది. వాట్స్ యాప్ లోని వందల గ్రూపులు దీనిని షేర్ చేసుకున్నాయి. వాట్స్ యాప్ నుంచి ట్విట్టర్, ఫేస్ బుక్ కు కూడా ఈ మెసేజ్ వ్యాపించింది. ఈ మెసేజ్ లో ...'రానున్న మూడు రోజులు చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని నాసా హెచ్చరించిందని, హరికేన్ కారణంగా ఈ వర్షాలు కురవనున్నాయని నాసా చెప్పిందని, దీని కారణంగా చెన్నైలో కనీవినీ ఎరుగని రీతిలో 200 నుంచి 250 సెంటీమీటర్ల వర్షపాతం కురవనుంద'ని పేర్కొన్నారు. ఇది భారీ ఎత్తున షేర్ కావడంతో చెన్నైలోని పలువురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మరో రెండు రోజులపాటు సెలవులు పెట్టారు. మరి కొంత మంది చెన్నైలోని మిత్రులకు ఫోన్ చేసి రావచ్చా? అక్కడి పరిస్థితి ఎలా ఉంది? అంటూ ఆరాతీయడం మొదలు పెట్టారు. అయితే నిన్నటి నుంచి చెన్నైలో చుక్కవర్షం కురవకపోవడం విశేషం.