: వాతావరణాన్ని మార్చేసే స్ర్పే!
మండుటెండలో... పొగ మంచు కురిపిస్తుంది ఈ స్ప్రే. దాదాపు గంటపాటు దాని ప్రభావం ఉంటుంది. అట్మాస్పియర్ ఏరోసోల్ పేరుతో ఒక కంపెనీ ఈ ఫాగ్ స్ప్రేను తయారు చేసింది. ఈ ఫాగ్ స్ప్రే ని ఏవిధంగా వాడాలంటే... పొగమంచు కురుస్తున్నట్లు కనిపించాలనుకునే ప్రదేశంలో సుమారు 5 లేదా 6 నిమిషాల పాటు దీనిని స్ప్రే చేయాలి. కొద్ది సేపట్లోనే ఆ ప్రాంతమంతా పొగ మంచు కురుస్తున్నట్టుగా ఉంటుంది. ఈ స్ప్రే తయారీకి ఉపయోగించే రసాయనాల విషయానికొస్తే బ్యూటేన్, ప్రొపేన్ తో పాటు మినరల్ ఆయిల్స్ తో ఇది పని చేస్తుంది. ఈ స్ప్రేతో ఎటువంటి ప్రమాదం లేకపోయినప్పటికీ జాగ్రత్తగా ఉండటం మంచిదని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.