: సెక్క్ వర్కర్ల విశాల హృదయం... రూ.లక్ష విరాళం !


చెన్నై వరద పరిస్థితులను, బాధితులను చూస్తుంటే ఎవరికైనా సరే కడుపు తరుక్కుపోతుంది. ఎంతటి వారికైనా ఏదో ఒక సాయం చేయాలనిపించకుండా ఉండదు. అలాగే, పడుపు వృత్తి ద్వారా జీవనాన్ని కొనసాగిస్తున్న మహారాష్ట్ర సెక్స్ వర్కర్లు సైతం తమ సాయాన్ని అందించారు. తమకూ విశాల హృదయం ఉందని చాటుకున్నారు. చెన్నై వరద బాధితులకు సాయం అందించే నేపథ్యంలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో 'స్నేహాలయ' అనే స్వచ్ఛంద సంస్థ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సెక్స్ వర్కర్లు కూడా హాజరయ్యారు. వరద బాధితుల సాయం నిమిత్తం లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అనిల్ కవాడేకు వీరు అందజేశారు. కాగా, అహ్మద్ నగర్ జిల్లాలో సుమారు 3 వేల మంది వరకు సెక్స్ వర్కర్లు ఉన్నారు. వారిలో 2 వేల మంది సెక్స్ వర్కర్లు ఈ విరాళాలు ఇచ్చారు.

  • Loading...

More Telugu News