: మాదిగలను కేసీఆర్ మోసం చేశారు: ఎమ్మార్పీఎస్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలను మోసం చేశారని ఎమ్మార్పీఎస్ నేతలు మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేస్తానని గతంలో చెప్పిన కేసీఆర్... ఆ మాటను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ... సికింద్రాబాద్ మారేడుపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ శ్రేణులు ధర్నా చేశాయి. పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.