: కోర్టు భాష ఇంగ్లీషే... తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
కోర్టు భాష ఇంగ్లీషేనని... ఇతర భాషల్లో తీర్పులను వెలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం వెలువరించే తీర్పులను హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకు వచ్చేలా ఆదేశించాలన్న ఒక పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ను కొట్టి వేసింది. ఇంగ్లీష్ మినహా మరే ఇతర భాషలోను తీర్పులను ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం చెప్పింది. కోర్టు కార్యకలాపాల్లో హిందీని అధికార భాషగా చేస్తూ రాజ్యాంగంలో సంబంధిత సవరణలు చేయాలన్న పిటిషన్ పై ఈ విధంగా స్పందించింది.