: ప్రతిదాన్ని వివాదం చేయవద్దు: వెంకయ్యనాయుడు


కాంగ్రెస్ పార్టీకి బీజేపీపై బురదజల్లడమే పనా? అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పార్లమెంటులో నిలదీశారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, నేషనల్ హెరాల్డ్ సాకుతో పార్లమెంటును అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కక్ష సాధింపు అనే సమస్యే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసును 2013లో న్యాయస్థానంలో ఫైల్ చేశారని, అప్పట్లో అధికారంలో ఉన్నది ఎవరో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. అలాంటి కేసును కక్ష సాధింపు అనడం ఎంతవరకు సమంజసమో కాంగ్రెస్ నేతలే చెప్పాలని ఆయన కోరారు. సభకు నోటీసులు ఇవ్వకుండా గోల చేయడం సంప్రదాయం కాదని ఆయన చెప్పారు. ప్రతిదాన్ని వివాదం చేయవద్దని కాంగ్రెస్ నేతలకు ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News