: విధిలేని పరిస్థితుల్లో కర్ణాటక లోకాయుక్త రాజీనామా


కర్ణాటక లోకాయుక్త జస్టిస్ భాస్కరరావు ఎట్టకేలకు రాజీనామా చేశారు. లోకాయుక్త కార్యాలయం నుంచి బెదిరించి వసూళ్లు చేసే ఒక ముఠా నడుస్తోందనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే, భాస్కర రావు కుమారుడు అశ్విన్ ను గత జులైలో లో అరెస్ట్ చేశారు. లోకాయుక్త దాడులు జరగకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని అశ్విన్ డిమాండ్ చేసినట్టు సమాచారం. తన కుమారుడు అరెస్ట్ అయినప్పటి నుంచి లోకాయుక్తకు భాస్కరరావు రాజీనామా చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. మరో విషయం ఏమిటంటే, డిమాండ్ చేస్తున్న వారితో పాటు మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే కూడా గొంతు కలిపారు. దీంతో, జులై చివరి వారం నుంచి లోకాయుక్త సెలవుపై వెళ్లారు. ఇదే సమయంలో, లోకాయుక్తను తొలగించే ప్రక్రియను సులభతరం చేస్తూ కర్ణాటక అసెంబ్లీ చట్టంలో సవరణలు చేసింది. కొత్త చట్టం ప్రకారం మూడో వంతు సభ్యులు తీర్మానం మీద సంతకం చేస్తే చాలు... లోకాయుక్తను తప్పించవచ్చు. ఈ క్రమంలో, తనను తప్పించడం ఖాయమనుకున్న భాస్కరరావు... తానే తప్పుకుంటే మంచిదనే ఉద్దేశంతో రాజీనామా చేశారని విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News