: విశాఖ నావికాదళ ఆయుధాగారంలో అగ్నిప్రమాదం


విశాఖలోని నావికాదళ ఆయుధాగారంలో ఈ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఆయుధాలు భద్రపరచిన ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని తెలిసింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఐఎన్ఎస్ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News