: నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం నాపై కక్ష సాధించాలనుకుంటోంది: రాహుల్


నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఈ కేసు విషయంలో కేంద్రం తన పట్ల రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఈ కేసు ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని విమర్శించారు. కక్ష సాధింపు చర్యల ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించకుండా తనను అడ్డుకోవాలని చూస్తున్నారని, ఇది ఎప్పటికీ జరగబోదని రాహుల్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో ట్రయల్ కోర్టు ముందు ఈ నెల 19న హాజరుకావాలని ఈ రోజు ఢిల్లీలోని పాటియాలా కోర్టు సోనియాగాంధీ, రాహుల్ లను ఆదేశించింది.

  • Loading...

More Telugu News