: 'దొంగబ్బాయి' సాధ్యం కాదంటే... చంద్రబాబు చేసి చూపించారు: నారా లోకేశ్


ఏపీలో రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ... ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. నాలుగు వందల హామీల్లో రెండు వందల హామీలను ఇప్పటికే నెరవేర్చామని చెప్పారు. ఇందులో రూ. 24 వేల కోట్ల రైతు రుణమాఫీ, రూ. 10 వేల కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ కూడా ఉందని తెలిపారు. రుణమాఫీ చేయలేరని దొంగబ్బాయి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసి చూపించారని పరోక్షంగా జగన్ పై విమర్శలు గుప్పించారు. తమకు నీతి, నిజాయతీగా పనిచేయడమే తెలుసని లోకేశ్ అన్నారు.

  • Loading...

More Telugu News