: కల్తీ మద్యం కేసుతో మల్లాది విష్ణుకు ఎలాంటి సంబంధం లేదు: రఘువీరా


కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుపై వస్తున్న ఆరోపణలకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజయవాడలో స్పందించారు. ఈ కేసుతో విష్ణుకు ఎలాంటి సంబంధం లేదని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. స్వర్ణ వైన్స్ అతని తల్లి పేరు మీద ఉందని చెప్పారు. కల్తీ మద్యం ఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఘటనకు బాధ్యులైన వారే నష్టపరిహారం చెల్లించేలా చట్టంలో మార్పులు తేవాలని రఘువీరా ప్రభుత్వానికి సూచించారు. కల్తీ మద్యం ఘటనలో తాజాగా కేసులు నమోదు చేసిన పోలీసులు విష్ణును ఏ9గా చేర్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News