: మార్చిలో జైలు నుంచి విడుదలవుతున్న సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వచ్చే ఏడాది జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం వుంది. మార్చి నెల మొదటివారంలో ఎరవాడ సెంట్రల్ జైలు నుంచి సంజయ్ విడుదల కావచ్చని అధికార వర్గాలు చెప్పాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగివున్నాడన్న అభియోగాలు రుజువుకావడంతో సంజయ్ కు టాడా కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కేసులో గతంలో రిమాండ్ ఖైదీగా 18 నెలల పాటు సంజూ జైలు శిక్ష అనుభవించాడు. 2013లో ఈ కేసులో కోర్టు శిక్ష విధించడంతో మిగతా 42 నెలల శిక్షను గడుపుతున్నాడు.