: పోలవరం ప్రాజెక్టుకు పూజలు చేసిన చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను సందర్శించారు. నేటి ఉదయం విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. తొలుత పట్టిసీమ ప్రాజెక్టు వద్దకెళ్లిన ఆయన అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని ఆయన తిలకించారు. అనంతరం ఇటుకలపూడి వద్ద పట్టిసీమను ఆనుకుని ఉన్న పోలవరం కుడికాలువకు చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు.