: రాజకీయాలు చేసేందుకు రాలేదు: రాహుల్ గాంధీ
భారీ వర్షాల వల్ల అతలాకుతలమైన ఈ ప్రాంతాన్ని చూడటానికే వచ్చానని... రాజకీయాలు చేయడానికి కాదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. వరద బాధితులకు భరోసా ఇచ్చేందుకు ఈ రోజు ఆయన పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరద బీభత్సం నుంచి పుదుచ్చేరి, తమిళనాడు త్వరగా కోలుకోవాలని అభిలషించారు. వరద బాధితులకు భరోసా ఇవ్వాలని చెప్పారు. ఇదే సమయంలో వరద బాధితులకు కొన్ని వస్తువులను కూడా అందించారు. పర్యటనలో భాగంగా రియాన్ కుప్పం, కృమామ్ బక్కమ్, రోడీర్ పేట్ తదితర ప్రాంతాల్లో రాహుల్ పర్యటించనున్నారు. దీనికి తోడు, తమిళనాడులోని కడలూర్ జిల్లాలో కూడా రాహుల్ పర్యటన కొనసాగనుంది.