: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు 'స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్' అవార్డు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ)కు ప్రతిష్ఠాత్మక 'స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్' అవార్డు లభించింది. ఆధునిక సాంకేతికతల వినియోగానికిగాను ఈ అవార్డు ప్రకటించారు. దాని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దాదాపు ఏడువందల విభాగాలు పోటీపడ్డాయి. చివరికి టీఎస్ పీఎస్సీకే ఇది దక్కింది. దరఖాస్తుల నుంచి పరీక్షల దాకా అన్నింటా ఆన్ లైన్ సేవలను ప్రవేశపెట్టి, విజయవంతంగా నిర్వహించిన టీఎస్ పీఎస్సీని ఈ సంవత్సరం అవార్డు వరించిందని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ తెలిపారు. ఈ నెల 10న ఢిల్లీలో జరిగే సదస్సులో అవార్డును తెలంగాణకు ప్రదానం చేయనున్నారు.