: ఈ సాయంత్రం ఢిల్లీ వెళుతున్న సీఎం కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. రేపు అక్కడ జరిగే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె సొనాలి జైట్లీ వివాహ రిసెప్షన్ కు ఆయన హాజరవుతారు. ఇదే పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులను అయుత చండీ యాగానికి సీఎం ఆహ్వానించనున్నారని సమాచారం. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ లను ఆ యాగానికి కేసీఆర్ ఆహ్వానించారు. మరోవైపు ఇదే వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు.

  • Loading...

More Telugu News