: ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగాలు తెలంగాణ స్థానికులకే ఇవ్వండి: కోదండరామ్ విన్నపం


తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రాబ్యాంకు శాఖల్లోని ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ విన్నవించారు. కొత్తగా వచ్చిన సీఈవో సురేష్ పటేల్ ను ఆంధ్రాబ్యాంకు తెలంగాణ ఉద్యోగుల సంఘం తరపున కోదండరామ్ కలిశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఇక్కడి ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోదండరామ్ కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొత్త సీఈవో ఆధ్వర్యంలో తెలంగాణకు మేలు జరగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News