: పాలిటిక్స్ వదిలి బావతో కలిసి ప్రాపర్టీ డీలర్ షాప్ తెరచుకో!... రాహుల్ పై హర్యానా మంత్రి వివాదాస్పద కామెంట్


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శల జడివాన కురుస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి వరుస దాడులు చేస్తున్నారు. తాజాగా బీజేపీకి చెందిన నేత, హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వంతు వచ్చింది. రాహుల్ గాందీ రాజకీయాలు వదిలి తన బావ రాబర్ట్ వాద్రాతో కలిసి ప్రాపర్టీ డీలర్ షాప్ తెరచుకోవాలని విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాబర్ట్ తో కలిసి తెరచుకునే ప్రాపర్టీ డీలర్ షాప్ పేరును కూడా ఆయనే సూచించారు. సదరు షాపునకు ‘రాహుల్ అండ్ వాద్రా ప్రాపర్టీ డీలర్స్’ అనే పేరును ఆయన సూచించారు. అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారన్న ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News