: రైలు ప్రమాదానికి ప్రకృతి కూడా కారణం: సీపీఆర్ఓ
ఈ ఉదయం హర్యానాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో మానవ తప్పిదం లేదని, దట్టమైన పొగమంచు కారణంగా సిగ్నల్స్ అతి సమీపంలోకి వచ్చేంత వరకూ కనిపించే పరిస్థితి లేకపోవడమే కారణమని గుర్తించామని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నీరజ్ శర్మ తెలిపారు. ఉదయం 8:25కు ఈ ప్రమాదం జరిగిందని, ఈఎంయూ డ్రైవర్ మరణించాడని ఆయన స్పష్టం చేశారు. ఈఎంయూ డ్రైవర్ నిద్రమత్తులో ఉండి వుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల్లో మృతులపై సమాచారం లేదని, వంద మందికి పైగా గాయపడ్డట్టు తెలిసిందని వివరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు.