: నవాబుపేట జడ్పీటీసీ, గూరకొండ ఎంపీటీసీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు
రంగారెడ్డి జిల్లా నవాబుపేట జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎన్నికలో పోలీస్ రాంరెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మల్లారెడ్డిపై 699 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలిచినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ ఎంపీటీసీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై 300 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మమ్మ విజయం సాధించింది.