: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం... తమిళనాడును వదలని భారీ వర్షాలు
తమిళనాడును భారీ వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం కన్యాకుమారి, తిరునెల్వేళి, తూతుకుడి, పుదుకోటయ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఆ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇప్పటికే గత 25 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలమై పోయిన సంగతి తెలిసిందే.