: అమెరికా అమ్ములపొదిలో ప్రపంచపు అతిపెద్ద విధ్వంసకారిణి!


గాల్లోంచీ దూసుకు వస్తున్న క్షిపణులనైనా, నీటి అడుగు భాగం నుంచి వస్తున్న మిసైళ్లయినా, యుద్ధవిమానాలైనా, జలాంతర్గాములైనా... వాటి జాడలను గుర్తించి నాశనం చేసే డిస్ట్రాయర్ అది. పేరు యూఎస్ఎస్ జుమ్ వాల్ట్. అమెరికన్ నావీ కోసం తయారుచేసిన ఈ అతిపెద్ద విధ్వంసక నౌక పనితీరు పరీక్షల కోసం కెన్నీబెక్ నది ద్వారా సముద్రంలోకి తొలిసారిగా పయనించింది. 183 మీటర్ల పొడవు, 15 వేల టన్నుల బరువున్న ఈ డిస్ట్రాయర్ నుంచి అణుబాంబులను ప్రపంచంలోని ఏ దేశంపైనైనా వేయవచ్చు. అత్యాధునిక రాడార్, సోనార్, శక్తిమంతమైన మిసైల్స్, గన్స్ తదితరాలతో నిండివుండే దీన్ని తక్కువ మందితోనే నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు. కాగా, ఈ డిస్ట్రాయర్ యుద్ధ నౌక తయారీ నిమిత్తం అమెరికన్ సర్కారు 4.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 27 వేల కోట్లు) వెచ్చించింది. ఇటువంటివే మరో రెండింటిని తయారు చేయనుంది.

  • Loading...

More Telugu News