: ఒక్క ముస్లింను కూడా అమెరికాలో కాలు పెట్టనీయొద్దు: డొనాల్డ్ ట్రంప్


తదుపరి అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగుతాడని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తి నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. వలస వచ్చే వారిపైన, సందర్శకులపైన కూడా ఈ బ్యాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం దేశంలో ఏం జరుగుతోందన్న విషయాన్ని ప్రభుత్వ ప్రతినిధులు గుర్తించేంతవరకైనా నిషేధం అమలు చేయాలని, అమెరికాలో ముస్లింల జనాభా పెరుగుతూ ఉండటం దేశ భద్రతకు ముప్పుగా వాటిల్లక ముందే కదలాలని ఆయన అన్నారు. ఈ మేరకు ట్రంప్ పేరిట ఓ ప్రకటన వెలువడింది. "సమస్యను, ప్రమాదాన్ని గుర్తించాల్సి వుంది. కేవలం జీహాద్ పై మాత్రమే నమ్మకంతో ఉన్న కొందరు చేస్తున్న దాడులకు మనం బాధితులుగా మారాల్సిన అవసరం లేదు. వారికి మానవ జీవితాలంటే గౌరవం లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇప్పుడు నిరసనలు చెలరేగుతున్నాయి. "డొనాల్డ్ ట్రంప్ ఓ పిచ్చివాడు. అతని విధానం, ప్రతిపాదనలు అంత తీవ్రంగా తీసుకోవాల్సినవి కాదు" అని జెబ్ బుష్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News