: బాలయ్య ఇలాకాలో టీడీపీకి షాక్... పార్టీ పదవికి చిలమత్తూరు కన్వీనర్ రాజీనామా
టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తన నియోజకవర్గంలోనే షాక్ తగిలింది. సుదీర్ఘ కాలం పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న చిలమత్తూరు మండల కన్వీనర్ రంగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రంగారెడ్డి రాజీనామాకు బాలయ్య పీఏ శేఖర్ వ్యవహార శైలే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శేఖర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గతంలో నియోజకవర్గంలో కరపత్రాల పంపిణీ కూడా జరిగింది. పార్టీలో ఎలాంటి హోదా లేనప్పటికీ అంతా తానై చక్రం తిప్పుతున్న శేఖర్, పార్టీ నేతలను లెక్క చేయడం లేదట. దీంతో ఆయన వ్యవహార సరళిపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేయడంతో బాలయ్య సొంత నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలినట్లైంది.