: ఆజం ఖాన్... దావూద్ కన్నా ప్రమాదకారి!: శివసేన ఆరోపణ


తనపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్న సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ పై మరాఠా పార్టీ శివసేన ధ్వజమెత్తింది. ఆజం ఖాన్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కంటే ప్రమాదకారి అని ఆరోపించింది. ఈ మేరకు తన అధికారిక పత్రిక ‘సామ్నా’ తాజా సంచికలో ఆజం ఖాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్ మహల్ ను కూలగొట్టి శివాలయం కట్టేందుకు పనులు ప్రారంభిస్తే, తన వంతుగా పలుగు, పార తెస్తానని నిన్న ఆజం ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాస్తంత ఘాటుగానే స్పందించిన శివసేన ఆజం ఖాన్ ను దావూద్ ఇబ్రహీం కంటే ప్రమాదకారిగా అభివర్ణించింది.

  • Loading...

More Telugu News