: అప్పుడు కుదర్లేదు...ఇప్పుడు చేశాం: వరుణ్ తేజ్


తాను ఇంటర్ లో ఉండగా పెదనాన్న, బాబాయ్, డాడీ 'ఏం చేస్తావ్' అంటూ తిట్టేవారని వరుణ్ తేజ్ చెప్పాడు. 'లోఫర్' ఆడియో వేడుక సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పుడు బాగా లావుగా ఉండేవాడినని తెలిపాడు. అప్పుడు 'చిరుత' తీస్తున్న పూరీ జగన్నాథ్ దగ్గరకెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇవ్వమని కోరానని, దీంతో తన ఇంట్రెస్ట్ ఎంతో తెలుసుకుందామని భావించిన పూరీ, మరుసటి రోజు రమ్మని చెప్పారని, అయితే తాను వెళ్లలేదని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు అసిస్టెంట్ గా పని చేయకపోయినా, ఇప్పుడు హీరోగా అవకాశం ఇచ్చిన పూరీకి ధన్యవాదాలని వరుణ్ తేజ్ చెప్పాడు. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపాడు. ఆడియో వేడుకకి వచ్చిన ప్రభాస్ కి ధన్యవాదాలు తెలిపాడు.

  • Loading...

More Telugu News