: వరుణ్ కూడా వాళ్ల బాబాయిలా పెద్ద హీరో అవుతాడు: ప్రభాస్


వరుణ్ కూడా వాళ్ల బాబాయిలా పెద్ద హీరో అవుతాడని ప్రభాస్ అన్నాడు. 'లోఫర్' ఆడియో ఫంక్షన్ లో ప్రభాస్ మాట్లాడుతూ, అయితే అందుకు మీ (అభిమానుల) సహాయం కావాలని, అతనిని ఇలాగే ప్రోత్సహించండని చెప్పాడు. పూరీతో నటించేందుకు ఆరు నెలలు వెయిట్ చేశానని ప్రభాస్ చెప్పాడు. స్టార్ నుంచి సూపర్ స్టార్ అవ్వాలంటే పూరీతో సినిమా చేయాలని ప్రభాస్ పేర్కొన్నాడు. వరుణ్ తేజ్ కూడా త్వరలోనే సూపర్ స్టార్ అవుతాడని ప్రభాస్ చెప్పాడు. పూరీ జగన్నాథ్, తాను మంచి స్నేహితులమని, తాను బయటకు వెళ్లాలనుకుంటే పూరీతోనే వెళ్తానని ప్రభాస్ వెల్లడించాడు. పూరీ టాలెంట్ గురించి రాజమౌళి ఓసారి చెబుతూ, తాను వంద రోజులు తీసిన సీన్ ని పూరీ ఒక్కడైలాగ్ తో అధిగమించేస్తాడని అన్నారని గుర్తు చేసుకున్నాడు. పూరీ అంతటి టాలెంటెడ్ డైరెక్టర్ అని ప్రభాస్ తెలిపాడు.

  • Loading...

More Telugu News