: వరుణ్ నా కళ్ల ముందే అడ్డంగా పెరిగాడు: పూరీ జగన్నాథ్


హీరో వరుణ్ తేజ్ చిన్నప్పటి నుంచి తన కళ్లముందే పెరిగాడని పూరీ జగన్నాథ్ తెలిపాడు. లోఫర్ ఆడియో వేడుక సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరుణ్ తేజ్ చిన్నప్పుడు బాగా లావుగా ఉండేవాడని చెప్పాడు. అప్పుడు నాగబాబుగారి ఇంటికెళ్లినప్పుడల్లా, 'ఏంటండీ నాగబాబుగారూ! వరుణ్ అడ్డంగా పెరుగుతున్నాడు. హీరో అవుతాడంటారా?' అని అడిగేవాడినని, దానికాయన 'ఏమో పూరీ, వాడేమవుతాడో అర్థం కావడం లేదు' అని అనేవారని పూరీ చెప్పాడు. ఎనిమిదేళ్ల క్రితం అకస్మాత్తుగా వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయినవుతానని అడిగాడని, అయితే ఇప్పుడు నాకు సినిమా ఇచ్చే స్థాయికి తను ఎదిగాడని చెప్పాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడని పూరీ కితాబు ఇచ్చాడు.

  • Loading...

More Telugu News