: వరుణ్ తేజ్ నోటి నుంచి పవన్ కల్యాణ్ డైలాగ్!
హైదరాబాదులోని శిల్పకళా వేదికలో వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమా ఆడియో వేడుక జరిగింది. ఈ ఆడియో వేడుకలో ముఖ్య అతిథులుగా ప్రభాస్, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో పూరీ జగన్నాధ్ ఓ నిబంధన పెట్టారు. అదేమిటంటే, ముందుగా రాసి ఉంచిన చీటీల నుంచి ఒక చీటీ ఎంచుకుని, అందులోని నటుడి సినిమా డైలాగ్ ఒకటి చెప్పాలి. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ కు పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో అత్యంత ఆదరణ పొందిన డైలాగ్ వచ్చింది. ఈ డైలాగును చెప్పేందుకు ప్రయత్నించిన వరుణ్ తేజ్ 'చూడప్పా సిద్దప్పా' అంటూ గంభీరంగా మొదలు పెట్టినా... ఆ తర్వాత డైలాగ్ మర్చిపోయానన్నాడు. దీంతో అంతా పెద్దగా నవ్వేశారు. ఆ తరువాత చీటీలో ఉన్న డైలాగ్ చదువుతూ ఏదో చెప్పాననిపించాడు.