: కల్తీ మద్యం బాధితులకు చంద్రబాబు పరామర్శ
విజయవాడలో కల్తీ మద్యం ఘటనలో ఆసుపత్రి పాలైన బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి బాబు వెళ్లారు. కాగా, సీఎం సందర్శించిన ఆసుపత్రి బయట వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. విజయవాడ కృష్ణలంకలో స్వర్ణ బార్ లో కల్తీ మద్యం తాగిన సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే.