: రష్యా అన్నంత పనీ చేసింది...కుదేలవుతున్న టర్కీ
రష్యా అన్నంత పనీ చేసింది. తమ యుద్ధ విమానం కూల్చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ప్రకటించిన రష్యా టర్కీపై ఆంక్షలు విధించింది. టర్కీ నుంచి రష్యాకు ఎగుమతయ్యే ఆహారోత్పత్తులను నిషేధించింది. అలాగే రష్యా నుంచి ఆహార దిగుమతులను కూడా నిషేధించింది. రష్యా నుంచి టర్కీకి అందాల్సిన ఇంధన సహాయాన్ని కూడా నిలిపేసింది. రష్యా నుంచి టర్కీకి 55 శాతం సహజవాయవు, 35 ఇంధనం అందుతుంది. వీటిని రష్యా నిలిపేసింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన టర్కీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నా అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో రష్యా ఆంక్షల కారణంగా ఈ వారంలో తాము 60 వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్టు టర్కీ ఉప ప్రధాని మహ్మద్ సింసెక్ వెల్లడించారు.