: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో చర్చలు జరపాలి: దలైలామా
ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని బౌద్ధ మతగురువు దలైలామా అభిప్రాయపడ్డారు. ఇటాలియన్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన పలు ఆసక్తికర సూచనలు చేశారు. ఇస్లాం అనేది శాంతితో కూడుకున్న మతమని ఆయన చెప్పారు. ఆ మతంలో ఉన్నవారే తమ సొంత మతానికి కీడు చేస్తూ, సొంత సోదరులకు హాని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో మాట్లాడితే సత్ఫాలితాలు ఉంటాయని అన్నారు. వారితో సరైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, హింస ఏ రూపంలో ఉన్నా దానిని బౌద్ధం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే.