: పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభకు వివరణ ఇచ్చిన కేంద్రం
పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై ఇంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 345 కోట్ల రూపాయలు చెల్లించామని కేంద్రం రాజ్యసభకు తెలిపింది. 16,010 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అంగీకరించామని వివరించింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే ప్రయత్నంలో భాగంగా, ప్రస్తుతం 22 ప్యాకేజీల్లో 7, 906 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది.