: మీ ఫేస్ బుక్ ఖాతాను ఎవరు అన్ ఫ్రెండ్ చేశారు? ఎవరు డిలీట్ చేశారో ఇలా తెలుసుకోండి


సాంకేతిక విప్లవం కారణంగా ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. ప్రతి స్మార్ట్ ఫోన్లోనూ విధిగా ఫేస్ బుక్ యాప్ ఉండాల్సిందే. దీంతో ఏ పని చేస్తున్నా స్నేహితులు ఏం వ్యాఖ్యలు చేశారు? మనం పోస్టు చేసిన వ్యాఖ్యలకు స్పందన ఎలా ఉంది? అనే విషయాలను పదేపదే చూసుకోవడం చాలామందికి అలవాటైపోయింది. అయితే ఫేస్ బుక్ లో మనల్ని ఎవరు అన్ ఫ్రెండ్ చేశారు? ఎవరు డిలీట్ చేశారు? అనే విషయాలు మనకు స్పష్టంగా తెలియవు. వినియోగదారులకు ఈ సమస్యను దూరం చేసేందుకు ఫేస్ బుక్ రెండు యాప్స్ ను వినియోగంలోకి తెచ్చింది. హూ అన్ ఫ్రెండ్ మీ, హూ డిలీటెడ్ మీ అనే రెండు యాప్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు యాప్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే మీతో ఫేస్ బుక్ ద్వారా ఎవరు అనుసంధానమై ఉన్నారు? ఎవరు మీ స్నేహం వద్దనుకుంటున్నారు? ఎవరు మిమ్మల్ని బ్లాక్ చేశారు? వంటి విషయాలన్నీ తెలుస్తాయని ఫేస్ బుక్ చెబుతోంది.

  • Loading...

More Telugu News